కొండ పైన కొండ, ఆపైన మరో కొండ, ఆ కొండ మధ్య దారి నెళ్తే, కనగ నేడో కొండ. ||కొండ|| 1. కోదండ రాముడంట, కౌసల్య పుత్రుడంట, భ ద్రాద్రి రాముడంట, భద్రంగ కాయు నంట, సౌ మిత్రి యన్న యంట, సీతమ్మ పెనిమిటంట, యీతిన్నె పైన యింట, ఎపుడో చేరెనంట. ||కొండ|| 2. నామాలు పెట్టునంట, నయగార మొలుకు నంట తోమాల వేయు నంట, తిరుణాళ్ళ తిరుగునంట, కామనలు తీర్చు నంట, కరుణ చూప నంట, శ్రమలు తీర్చు నంట, సేవించి మ్రొక్కినంత. ||కొండ|| 3. ప్రతి రోజు వాని యింట, పెండ్లి సందడంట, ప్రతి వారి వద్ద వాడు, సొమ్ము గుంజు నంట, చేతు లెత్తి మొక్క, సిరులు గురుపు నంట, నాతి మంగ తోటి, అభయంభు లిచ్చునంట. ||కొండ|| 4. శ్రీనివాసు డంట, శ్రీలక్ష్మి విభుడు యంట, కనికరించ వీడు, కైవల్య మిచ్చు నంట, మానసాల లోన, ముదము కూర్చు నంట చాన చాన ఎంతో, మహిమ జూపు నంట. ||కొండ|| రమాకాంతరావు చాకలకొండ May 3 2007, Cincinnati OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |