పల్లవి. ఎవరయ్య మిత్రులు, ఎవరు నీ ఆప్తులు ఎవరయ్య లోకమున ఆత్మ బంధువులు. ||ఎవరయ్య|| అనుపల్లవి. ఎవరికి వారైన యీ స్వార్ధ జగతిన ఎవరయ్య తోడుగ ఉండెడి వారు? ||ఎవరయ్య|| 1. అన్ని అమరిన వేళ, ఆనంద వేళలో అన్న, పానము తరికి అందెడి వేళ, మిన్నైన మిత్రులుగ మసలెడివారే, కన్నీటి వేళలో కనిపించు వారా? ||ఎవరయ్య|| 2. నెమ్మి, ప్రేమలు చూపి నీ తోటి తిరుగుచూ, కమ్మని మాటలతో కార్యములు దిద్దుకొని, నమ్మకముగా ఉండి నయము జూపెడి వారు తమ అవసరము తీర తప్పుకొని పోరా? ||ఎవరయ్య|| 3. ప్రేమ కరువైనపుడు పలుచనగు బంధములు తామసుల ఎదకేవి తప్పుగ తోచవు, రాముని చరణములు నమ్మెడి వారికి సర్వవేళలయందు శ్రీహరే తోడు. ||ఎవరయ్య|| రమాకాంతరావు చాకలకొండ May 8, 2007 Cincinnati OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |