Creative works from Telusuna Members

బ్రతుకు నాటకములో పరుగెత్తు ఆటలో,

రమాకాంతరావు చాకలకొండ

బ్రతుకు నాటకములో పరుగెత్తు ఆటలో,
అలసితిని ఎంతగో శ్రీవేంకటేశ,
మెతుకు గతకను మహిన ఎందుకీ యాతనలు,
శ్రితజన పోష శ్రీ శ్రీనివాస? ||బ్రతుకు||

1. నానాటి బ్రతుకులో నీచమగు పాత్రలా?
నలుగురితో నిత్యము వేయు నాటకములా,
పన్ని ఎన్నో చేయు పరమ దౌత్యములా, ప్ర
చ్ఛన్న పామర పూత వేషములా? ||నానాటి||

2. మోముపై చిరునవ్వు, మనసులో ద్వేషములు,
మోహమాటము కొఱకు మంచి వర్తనలా?
యిహలోకము యందు యీ పొట్ట నింపుటకు,
సహనపు నటనలతో శిరో ఖండనలా? ||నానాటి||

3. పై పైకి నటియించు ప్రేమ భావనలు,
అబ్బురము! ఎదలోన ఆరని జ్వాలలు,
మైపూతగ మెరుగు మంచి మాటలతో
కైపులో త్రోసేసి కంఠ ఛేదనలా ||నానాటి||

రమాకాంతరావు చాకలకొండ
May 1 2007, Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list