Creative works from Telusuna Members

వలపు లందించెడి వన్నె మోము

రమాకాంతరావు చాకలకొండ

రాగం: సామంతం

పల్లవి. వలపు లందించెడి వన్నె మోము,
తలపులు దోచెడి తీపి మోము. ||వలపు||

అనుపల్లవి. కలికి పద్మావతి కోరి వలచిన మోము, తిరు
మలేసుని తేట తొలుకు మోము. ||వలపు||

1. వలరాయుని తల్లి వగపడే మోము, వే
వేల వనితలు వలచు మోము,
గొల్ల కాంతల గుండె గుచ్చు కొను మోము,
చల్లగ అందరిని చూచు మోము. ||వలపు||

2. చంద్ర వదన సిరికి సమజోడు యీ మోము,
అందాల మంగకే అందు మోము,
సుందరి భూకాంత సురత మాడెడి మోము,
కందువగ అందరిని కాచు మోము. ||వలపు||

3. నంద యశోదల అనునయపు యీ మోము,
అందరికి ఆనంద మిచ్చు మోము,
ఇందిర సుందరితో ఇహ పరము లందించు,
బృందవన చంద్రు బేల మోము. ||వలపు||

రమాకాంతరావు చాకలకొండ
May 31 2007, Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list