శశి సూర్య నయనాయ, చారు వదనాయ, విహిత విద్యోతాయ వేంకటేశాయ. || శశి సూర్య|| 1. అనుపమ దయాగుణ, అమృత స్వరూపాయ, పన్నగ శయనాయ, పద్మనాభాయ, ఆ పన్న శరణాయ, అర్త జన వత్యాయ, దీన దుఃఖ పోష దామోదరాయ. || శశి సూర్య|| 2. మందార మధు పుష్ప మాలిక దామాయ, సుందర సుకుమార శ్యామలాంగాయ, ఆ నందరూపాయ, అవిరళ వ్యాప్తాయ, కందర్ప జనకాయ, కేశవాయ. || శశి సూర్య|| 3. కారుణ్య నయనాయ, కమల నాభాయ, దారుణ భవ రోగ బంధ నాశాయ, తిరువేంకటేశాయ, త్రైలోక్య వంద్యాయ, వర దాన సహజ గుణ , వరద హస్తాయ. || శశి సూర్య|| చాకలకొండ రమాకాంతరావు July 4, 2007 Cincinnati, OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |