Creative works from Telusuna Members

కావు యివి కన్నులకు కల్గిన రోగములు

చాకలకొండ రమాకాంతరావు

కావు యివి కన్నులకు కల్గిన రోగములు,
ఏవేవో జన్మల దుష్కర్మ ఫలములు.. || కావు యివి||

1. ఆడి తప్పితినేమో ? అంధకారము కమ్మె,
పైడి దోచితినేమో ? పాపములు చుట్టె,
వాడి మాటలతోటి వేధించితిని యేమో ?
మోడుగ మారినది యీ బ్రతుకు నేడు! || కావు యివి||

2. చెడు పనులు చేసితినో ?చేతులు చితికినవి,
పాడు మాటాడితినో? పడిపోయె నోరు,
దాడి చేసితినేమో ? తెగిపోయె పాదములు
పాడిగ యిటు కల్గె పాపముల ఫలము! || కావు యివి||

3. ఆడు వారిపైన అకృత్య ఫలితమో
ఆడకుండ పోయె అన్ని అంగములు,
వేడ వేంకటపతే వన్నెగ నాతోడు
ఏడ పోయిన యింక తీరునా చేడు. || కావు యివి||

చాకలకొండ రమాకాంతరావు
July 5, 2007 Cincinnati, OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list