Creative works from Telusuna Members

వెన్నలాంటి మనసులో వెతలు యేల?

చాకలకొండ రమాకాంతరావు

వెన్నలాంటి మనసులో వెతలు యేల?
అన్నింటికి హరి ఆత్మభవు డుండగ! ||వెన్నలాంటి||

1. హరి దాసులకు నిత్య ఆనందమే గదా!
సిరి సంపదలపైన శోచ నేల ?
సిరి నాధుడే మన వెన్నంటి ఉండగ,
భూరి భాగ్యములపై మనసు యేల ? ||వెన్నలాంటి||

2. హరి చరణ కమలాల చల్లని తావుండ
రారాజుల పాద సేవ లేల ?
దరి చేర్చి దీవించు ధరణీ ధరుండుండ
వెరపింక మదిలోన యించుకేల? ||వెన్నలాంటి||

3. హరి నామ మాధుర్య సంకీర్తన యుండ
నర రూప ధారుల కీర్త నేల?
తిరువేంకటేశునే తత్వముగ భావింప
వేరింక అన్యుల ప్రార్ధనేల ? ||వెన్నలాంటి||

చాకలకొండ రమాకాంతరావు
July 07 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list