Creative works from Telusuna Members

పరుల ఆనందము పంచుకొన జాలని

రమాకాంతరావు చాకలకొండ

పరుల ఆనందము పంచుకొన జాలని
నరుల జీవనము నికృష్టమే గదా!
సిరుల తుల తూగుచు సాటి వారుండగ
పరితాప మొందుట పామరత్వమే గదా! ||పరుల||

1. సాయి సాయి యంటూ సాధనలు చేయుచూ
నెయ్యము మరచుట నీచత్వమే గదా!
హాయిగ పెండ్లిండ్లు, పబ్బముల పాల్గొనని,
దాయాది మత్సరము దీనత్వమే గదా! ||పరుల||

2. ప్రేమ, కరుణలు రెండు పెదవికే వదిలేయు,
ధర్మ వర్తన లేమి దైత్య గుణమే గదా!
నామ మాత్రమే నోరు నారాయణ యనుచు
కామముల కృంగుట కఠినత్వమే గదా! ||పరుల||

3. చిరునగవులు చింద చెలిమిగ పలికెడి
ధీరుల హృదయ ద్యుతి దైవత్వమే గదా!
తిరువేంకటేశుని తత్వముగ భావించి
పరులతో మెలగుటే ప్రేమ తత్వము గదా! ||పరుల||

రమాకాంతరావు చాకలకొండ
July 8, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list