Creative works from Telusuna Members

తెలసిన బ్రతుకులకు తెఱకువేది ?

రమాకాంతరావు చాకలకొండ

తెలసిన బ్రతుకులకు తెఱకువేది ?
తెలివిగ మసలు యా తత్వమేది ? ||తెలసిన||

1. వలచి వలపించుటకు, వయ్యారి పొందుకు,
విలువైన కాలము వ్యర్ధమై పోగ,
కొలచి కోదండుని కైవల్యము నొంద, కనుచూ
పుల మేర కాంతి ఏది ? ||తెలసిన||

2. తనువుపై తగని యా తమకము పెంచుకొని
కనక మార్జించుటకే కాలము సాగించ,
ఇనకులేశుని పదము ఇంపుగ కొల్చటకు
మనమున తలపోయ మధన ఏది ? ||తెలసిన||

3. మెర మెచ్చులు చేసి, మై గంధము పూసి
తరుణుల పొందుకై తల్లడిల్లెడి మదికి,
తిరుమలేశుని పదము తృప్తిగా కొల్చుటకు,
ఏర్పరుప ఇసుమంత శుద్ధి ఏది ? ||తెలసిన||


తత్వము అను పదము ఇచ్చట 'స్వభావము' అను అర్ధములో వాడ బడినది

రమాకాంతరావు చాకలకొండ
July 13, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list