పల్లవి. ఆదిదేవు డితడు, ఆశ్రిత వల్లభుడు ఆది శేషునిపైన , ఆది నారాయణుడు. ||ఆది|| అనుపల్లవి. శ్రితజన పోషకుడు, శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీ వత్సగాత్రుడు, శ్రీ శ్రీనివాసుడు. ||ఆది|| 1. కేశవుడు, మాధవుడు, కోదండరాముడు, దాసులును సరిగాచే దేవకి నందనుడు, కంసాది దానవుల హంస లేపిన వాడు, దోషములు లేనట్టి దయాసాగరుడు. ||ఆది|| 2. వామనుడు విష్ణువు, విశ్వజన పోషకుడు, కాముని జనకుడు, కల్యాణ రాముడు, శ్యాముడు, శ్రీకరుడు, శ్రీదేవి విభుడు, సర్వ నాముడు, శివుడు, సుందరాకారుడు. ||ఆది|| 3. నరసింహ రూపుడు, నిఖిలేశ్వరడు, గిరిధర గోపాలుడు, గోకుల ప్రియుడు వరములిచ్చేవాడు, వైకుంఠవాసుడు, తిరువేంకటగిరి, తత్వము వీడు. ||ఆది|| చాకలకొండ రమాకాంతరావు July 14, 2007 |
#maa telugu talliki mallepU daMDaa# |