పల్లవి. హరి దాసులగు మాకు అభిమానమా? ఎ వరేమి యన్ననూ అవమానమా? ||హరి|| అనుపల్లవి. శ్రీపాద పంకజ చందన గంధముకు చెదరి నేల జార సుకుమారమా? ||హరి|| 1. హరి శిరము నైననూ, చరణముల నైననూ తరియించు విరులకు వయ్యారమా? హరి గళమున చేరి తోమాలగ విరసి మరునాడు మాడుటకు సంకోచమా? ||హరి|| 2. అవమానము మాకు, ఆనందమూ ఒకటే భువిలోన భూషణ, దూషణల భయమా? రవి యన్న, శశి యన్న, రాక్షసుడు యన్నా ఎవరేమి యన్ననూ విచారమా? ||హరి|| 3. పొగడినా, తెగడినా, పొమ్మని పల్కిన, ఎగడు దిగుడుకు జార అభిశాపమా? ఎగుడు కొండలవాడు ఏలికగ మాకున్న శగలైన పొగలైన సంతాపమా? ||హరి|| రమాకాంతరావు చాకలకొండ July 06,2007 |
#maa telugu talliki mallepU daMDaa# |