తను బాధలన్నీ తియ్యగా తొలగించు, తరియింప జేసెడి తిరుమల నామం, తనివి తీరగ మదిని తేలిక పరచును తామసము తొలగించు తిరుమల నామం. ||తను|| 1. జన్మ జన్మల చెఱలు చక్కగా విడిపించు జలజనాభుడు చక్రి మధుర నామం, అనుబంధ పాశములు అంతమొందించును అచ్యుతుని అద్భుత అమృత నామం. ||తను|| 2. కామ, క్రోధములనే కలుషములు కడుగును కమల నాభుడు హరి కమ్మని నామం, శమ, దమాదులు గూర్చి శాంతి చేకూర్చును శ్యామలాంగుని అమల సరళ నామం. ||తను|| 3. వ్యాధి, వృద్ధాప్యపు బాధల నుడిగించు, వేంకటాద్రి వాసి దివ్య నామం శోధించిన యిది సర్వ మంగళకరము శ్రీ శ్రీనివాసుని సుధా నామం ||తను|| చాకలకొండ రమాకాంతరావు July 21 2007 |
#maa telugu talliki mallepU daMDaa# |