Creative works from Telusuna Members

శాంతము నీయుము శ్రీరామ

రమాకాంతరావు చాకలకొండ

పల్లవి. శాంతము నీయుము శ్రీరామ, మది
భ్రాంతులు తీర్చుము రఘురామ. ||శాంతము||
అనుపల్లవి. అంతములేని ఆశా పాశపు,
సూత్రము తెంచుము సీతారామ. ||శాంతము||

1. ధన కనకముల దాహము తోటి
మనమున చెలగిన మంటల నార్పి
ననయగ నీపై భక్తిని గూర్చుము,
వనమాలి ఓ వేంకటధామ! ||శాంతము||

2. తామస తెరల చీకటి తీర్చి,
శమ, దమాదుల సంపద నిచ్చి,
సమభావ సందర్శన కాంతులు,
యిమ్ముగ నిమ్ము ఇనకుల సోమ. ||శాంతము||

3. అరిషడ్వర్గపు అడుసులు అంటక
నిరతము కరుణ, మమతలు నిండిన
స్థిరమగు మనమును చక్కగ నిమ్ము
తిరుమల ధామ! తోమాల దామ! ||శాంతము||

రమాకాంతరావు చాకలకొండ
July 23 2007


#maa telugu talliki mallepU daMDaa#

Back to list