Creative works from Telusuna Members

ప్రేమంటే ఏమో ? పైసాకు అంట దేమో

Amerika Kokila

Dear Friends, if you know what is love let me know, this is what I think about it …

ప్రేమంటే ఏమో ? పైసాకు అంట దేమో
నమ్మకాన్ని ఏమో, అది వమ్ము చేయ దేమో!

గుండె లోతు కేమో, అది మధుర భావ మేమో?
మండు ఎండ నేమో, అది మరుల తెమ్మెరేమో?
నిండు మనసు నేమో, అది అంటి వుండు నేమో?
పండి నప్పు డేమో, అది పెళ్ళి పందిరేమో ?

ఆకశాన ఏమో, అది వెండి మబ్బు ఏమో,
శోక మందు తోడై, చేయూత నిచ్చు నేమో?
ఆకళింత నేమో, అతి మధుర మగును ఏమో?
ఏక మైన క్షణము, అది వికసించును ఎమో?

నిర్వచనము లేని, అది మధుర భావ మేమో? ఎ
వరు ఎంత చెప్ప, అది పూర్తి గాదు ఏమో?
మరులు గొల్పు ప్రేమ, మన జన్మ వరము ఏమో?
మరు జన్మన తిరిగి, అది మనల కల్పు నేమో?


రచన: అమెరికా కోకిల
10/2/2007 1:35:43 PM


#maa telugu talliki mallepU daMDaa#

Back to list