Creative works from Telusuna Members

anubhuuti

Atri



విశాల జగతిలో, నిశీధి వేళలొ
శ్మసాన శూన్యంలో, ఏకాంత మౌనంలో
విరహాల ఎడారిలో, వడగాలి నిట్టూర్పులో
నిరాశ వీధుల్లో, స్మృతుల శిధిలాలో
యవ్వన జల్లులో, సున్నిత ప్రాయంలో
రంగుల ఊహల్లో, మృదు మధుర భావాలలో
అందాల కళశపు నడుములో, కదలాడే నాభి మోహంలో
తీరని కోర్కెల జాలంలో,తెలిసీ తెలియని బాధలలో
|విశాల|

సంపెంగి సమీరలతో, విరజాజి కౌగిలిలా
శారద సదృస్టిలా, సిరిలచ్చి ధన వృస్టిలా
కలిసేవు కలలలో, తుడిచేవు కన్నీళ్ళనీ
మధురాల ముద్దులతో,కురిసేవు జలపాతంలా
ఎర్రని గులాబి రంగులా, నను వీడని నీడలా
ఎదలోని సవ్వడి జోలలా,ప్రియురాలి అందెల ఘల్లులా
వాడని బొగడ పూలా,విడలేని మొగలి మత్తులా
యుగాల బంధంలా,శాశ్విత శిల్పంలా
కలిసేము మధుమాసంలో,విరిసేము రాగాల తోటలో
|విశాల|
'అత్రీ






#ii
viSaala jagatilO, niSiidhi vELalo
Smasaana SuunyamlO, Ekaanta maunamlO
virahaala eDaarilO, vaDagaali niTTuurpulO
niraaSa viidhullO, smRtula SidhilaalO
yavvana jallulO, sunnita praayamlO
ramgula uuhallO, mRdu madhura bhaavaalalO
amdaala kaLaSapu naDumulO, kadalaaDE naabhi mOhamlO
tiirani kOrkela jaalamlO,telisee teliyani baadhalalO
|viSaala|

sampemgi samiiralatO, virajaaji kaugililaa
Saarada sadRsTilaa, sirilacci dhana vRsTilaa
kalisEvu kalalalO, tuDicEvu kanniiLLanii
madhuraala muddulatO,kurisEvu jalapaatamlO
errani gulaabi ramgulaa, nanu viiDani niiDalaa
edalOni savvaDi jOlalaa,priyuraali amdela ghallulaa
vaaDani bogaDa puulaa,viDalEni mogali mattulaa
yugaala bamdhamlaa,SaaSvita Silpamlaa
kalisEmu madhumaasamlO,virisEmu raagaala tOTalO
|viSaala|
'atri'



Back to list