విధికి తల ఒగ్గిన వ్యధిత చిత్తముకు సాధింప, శోధింప యింకేమి గలదు ? ||విధికి|| 1. బాధ మానసములో వేదనగ నిండగ, ఉధధిలా ఉప్పొంగి ఉప్పెనగ మారగ, ఎదలోన ఎన్నెన్నో సుడులను రేపగ, కధ లాగ మారెను కమ్మని జీవితము. ||విధికి|| 2. శిధిలమైన ఎదపై సంతోష మేఘము, మధురమగు మమతలను మల్లెలు కురపిన నదిలోకి జారిన, నీరజములాగ, చెదిరి పోవుటే గాని, చక్కదన మబ్బునా? ||విధికి|| 3. వాదనతో, వేదనతో విసికిన హృదయముకు నాదములు తియ్యగ నిదుర మేల్కొలిపినా, చెదరిన కలలాగ చితికి పోవుటే గాని మధురిమల ఆమని మరల వచ్చునదా? ||విధికి|| అమెరికా కోకిల |
#maa telugu talliki mallepU daMDaa# |