Creative works from Telusuna Members

On his sharing the 2007 Nobel Peace Prize! to Our Dr Varanasi Prasad garu

రమాకాంతరావు చాకలకొండ

నలుగురి మేలుకై జీవించు నరుడే,
తల్చగ నిజమైన ఙ్ఞాన యోగి,
పలువురి బాగుకై పాటు పడువాడే,
కలుషములు లేనట్టి కర్మయోగి. || నలుగురి||

1. భువిలోని జీవులను బంధువలుగా నెంచి
సేవ చేయు వాడే శ్రేష్ట యోగి,
ఎవరి కష్టములైన తనవిగా భావించు
భువిలోని జీవుడే బ్రహ్మయోగి. || నలుగురి||

2. కాలుష్యమేదైన కడగ నెంచెడి వాడే
కలి కాలమందున కార్య యోగి,
ఫలిత మాశింపక పని చేయు ధీరుడే
తొలుత పూజార్హుడగు తత్వ యోగి. || నలుగురి||

3. మానవ సేవయే మార్గముగ నెంచుకొని
మనుగడ సాగించు మర్మయోగి,
పన్నగ శయనుడు పద్మనాభుడు హరి, దయ
లను బొందెడి దివ్య యోగి. || నలుగురి||

4. వారణాశి పతి పేరు సార్ధకముగ
తరలు తెలుగు వాడీ తంత్రయోగి
నర సేవలో ఎంతో నిష్ణాతుడైనట్టి
వీరికిదే వందనము చేతు వంగి. || నలుగురి||

రమాకాంతరావు చాకలకొండ


#maa telugu talliki mallepU daMDaa#

Back to list