Creative works from Telusuna Members

న్యాయము చేయుము నారాయణా!

చాకలకొండ రమాకాంతరావు


న్యాయము చేయుము నారాయణా!
దయగొని మాపై దీనావనా! ||న్యాయము||

1. దీనుల పాలిటి దిక్కువు నీవని, ఆ
పన్నులకు ఆత్మ బంధువని,
వీనుల విందుగ వింటిమి కధలు,
పన్నగ శయన చూపుము కృపలు. ||న్యాయము||

2. దానవ మద గజ దమన సింగమా,
మానవ జాతికి మేటి కవచమా,
కానగ జూపుము కన నీ ప్రభలు
వినవయ్యా యిక దీనుని మొరలు. ||న్యాయము||

3. దుర్మార్గులగు దైత్యుల బట్టి,
సరియగు రీతిన శాస్తిని చేసి,
నారసింహ యిక చూపుము దయలు,
దరి చేరి యిక తీర్చుము వగలు. ||న్యాయము||

చాకలకొండ రమాకాంతరావు July 28, 2007



#maa telugu talliki mallepU daMDaa#

Back to list