Creative works from Telusuna Members

నారాయణ! నీ నామ స్మరణే

రమాకాంతరావు చాకలకొండ

నారాయణ! నీ నామ స్మరణే, నరులకు తెచ్చును నిర్మల భక్తి,
తిరుమలేశ! నీ తియ్యని తలపే, తరింపజేసి యిచ్చును ముక్తి. ||నారాయణ||

1. వేద, శాస్త్రముల విమల ఙ్ఞానము,
చదువులలోని సర్వ సారము,
మోదముగ నీ మధుర నామము,
"మాధవ" యన్న కావా సొంతము. ||నారాయణ||

2. మూగ కిచ్చును మాటలు, పల్కులు,
అంగహీనతలు అది సరిదిద్దును,
నగధర నీ మధు నామ స్మరణతో
జగమున దుఃఖము సమసి పోవును. ||నారాయణ||

3. సిరి, సంపదలు సరి సమకూర్చును,
వరములు యిచ్చును, వంతలు తీర్చును,
ధరణీధర నీ దివ్య నామముతో,
ధరణిన జీవికి ముక్తి లభించును. ||నారాయణ||

రమాకాంతరావు చాకలకొండ
Wednesday, November 07, 2007





#maa telugu talliki mallepU daMDaa#

Back to list