రాగం: హిందోళ వసంతం పల్లవి. సరసపు నటనల ఓ దోర ! సిరి నీకు సరి జోడుర. ||సరసపు|| 1. పరుగులు, ఉరుకుల త్వరితముతో కరి నేలిన కరుణాకర, తరి యించగ నీ పద సేవనలే నిరతము నాకు యిమ్ముర. |సరసపు|| 2. గిరి నెత్తి గోకులముని గాచిన, మ ధుర నగరి సుందర, దరి చేర్చి నా దీనత తీర్చుము మురళీ గాన మనోహర. ||సరసపు|| 3. ముర, నరకాసుర, మద అసురులను తురిమిన తిరుమల భాస్కర, వరములు యిచ్చి వద్దకు గొనుము, శ్రీ ధర ! శ్రీకర ! భూధర! ||సరసపు|| రమాకాంతరావు చాకలకొండ Saturday, November 10, 2007 |
#maa telugu talliki mallepU daMDaa# |