Creative works from Telusuna Members

తెప్పలోని - తిరు నామాల వాడు

రమాకాంతరావు చాకలకొండ


తెప్పలోని - తిరు నామాల వాడు,
అప్పడు జగతిన అందరికి వీడు. ||తెప్పలో||

1. వటువుగ వసుధను యాచించిన వాడు,
వట పత్ర శాయి, వనమాలి వీడు,
పటువుగ పరశువు పట్టిన వీడూ,
దీటు నామాలున్న దేవుడు ఒకడే . ||తెప్పలో||

2. వేదాలు రక్షించి, వసుధను చేపట్టి,
మేదిన మనిషిగ పుట్టిన వాడు,
నాదాలు పలికించి, నయగారము జూపి
కదిలేను కళ్ళెము పట్టుకొని నేడు. ||తెప్పలో||

3. సుందరముగ హలము చేపట్టిన వీడు,
మంధరను మూపుపై మోసిన వాడు,
బంధువులను గాచ భీకర సింహుడై,
ఇందిరతో ఇప్పుడు తిరుమలపై వెలిసాడు. ||తెప్పలో||

రమాకాంతరావు చాకలకొండ November 11, 2007




#maa telugu talliki mallepU daMDaa#

Back to list