దైవ దర్శనం దుర్గాప్రసాదు వారణాసి (12 నవంబరు 2007) చిన్నారి పాపాయి చిరునవ్వులో దాగు శ్రీకృష్ణ భగవాను చిరుత నగవు పొన్నారి పాపాయి మొగమందు వెలుగొందు ఆనందమందులో నమరు వెలుగు అందాల పాపాయి చిందేటి అందాల నందుండు రూపంబు నటనదెల్ల బంగారు పాపాయి సింగారమదియెల్ల చిందేటి రూపంబు చిన్మయంబు చూడుమోయి నీ చిరుపాప చూపునందు దేవ దేవుండు వెదజల్లు దివ్య కాంతి గాంచుమోయి చిరుపాప కన్నులందు కమల నాభుని దేదీప్య కాంతి నెల్ల |
#deiva darSanam durgAprasAdu vAraNAsi (12 navambaru 2007) cinnAri pApAyi cirunavvulO dAgu SrIkRshNa bhagavAnu ciruta nagavu ponnAri pApAyi mogamamdu velugomdu AnamdamamdulO namaru velugu amdAla pApAyi cimdETi amdAla namdumDu rUpambu naTanadella bamgAru pApAyi simgAramadiyella cimdETi rUpambu cinmayambu cUDumOyi nI cirupApa cUpunamdu dEva dEvumDu vedajallu divya kAmti gAncumOyi cirupApa kannulamdu kamala nAbhuni dEdIpya kAnti nella# |