పల్లవి. మరణమే మాకిక మహదానందము, తరుణమిది తిరుపతి పదము చేరుటకు. || మరణమే|| అనుపల్లవి. కరుణతో హరి మమ్ము కాంచెడి వేళ శరణము కోరుటకు సముచిత వేళ. || మరణమే|| 1. అహము చచ్చిన వేళ, ఆనంద వేళ, యిహము పై యిచ్ఛలు యిగిరిన వేళ, సహనము, శాంతము సొంతమైన వేళ, ఊహలో వేంకని - వద్ద చేరిన వేళ. || మరణమే|| 2. ప్రేమామృతము ఎదన పదిలమైన వేళ, నామ మాధురి మదిన చేగోన్న వేళ, కామ, క్రోధములన్ని క్రుంగిన వేళ, రాముని చేరుటకు రమ్య మగు వేళ. || మరణమే|| 3. తామసము తఱగిన దివ్యమగు వేళ, సామ గాన ప్రియుని సంగత వేళ, తి రుమలేశుని తరచి తెలసుకొన్న వేళ, ఏమి యిక కోర్కెలు ఇంపగు యీ వేళ? || మరణమే|| రమాకాంతరావు చాకలకొండ Thursday, November 15, 2007 |
#maa telugu talliki mallepU daMDaa# |