Creative works from Telusuna Members

మము దయ జూడుము, మా కన్న తల్లీ

రమాకాంతరావు చాకలకొండ



మము దయ జూడుము, మా కన్న తల్లీ,
తామస నాశిని, తిరుమల వాసిని! ||మము||

1. కర పల్లవ మధు కమల పాణి,
హరి హృద్వాసిని, అమృత వాణి,
సిరి ప్రదాయని కరుణా ఫేని,
తిరుమల రాణీ, సిరి విరి శోణి. ||మము||

2. తిరుమల దేవి! తల్లివి జగతికి, నీ
చరణములే, నాకిక శరణము,
కరుణ రూపిణి, కమల వాసిని,
వరములు యిచ్చి బ్రోవవే తల్లీ. ||మము||

3. అలమేల్ మంగ! అనంగు జననీ!
తొలగించుము మది భారము లన్నీ
కలలో, యిలలో కొలిచెద నిన్నే,
కలత తీర్చి కాపాడవే తల్లీ! ||మము||

రమాకాంతరావు చాకలకొండ Friday, November 16, 2007


#maa telugu talliki mallepU daMDaa#

Back to list