సుధలొలుకు గానమే సంగీతమైనచో అది మాధవుని కైన మధురము మధురము. ||సుధలొలుకు|| 1. హరి పూజకై పూయు పుష్పమే పుష్పము, హరి సేవకై వంగు జన్మమే జన్మము, హరి పైన వ్రాసెడి గీతమే గీతము, హరి పైన ఒరిగెడి - మదియే మానసము. ||సుధలొలుకు|| 2. హరి తత్వము తెల్పు శాస్త్రమే శాస్త్రము, హరి నెఱుగ జేసెడి గ్రంధమే గ్రంధము, హరి కీర్తి పొగడెడి పద్యమే పద్యము, హరి స్మరణ చేసెడి నాలుకే ధన్యము ||సుధలొలుకు|| 3. హరి పేరు తల్చెడి హృదయమే హృదయము, హరిని ప్రార్ధించెడి హస్తమే హస్తము. తిరు వేంకని తెల్పు పాఠమే పాఠము, వేరు వాక్యము లన్నీ వ్యర్ధము వ్యర్ధము. ||సుధలొలుకు|| రమాకాంతరావు చాకలకొండ November 14, 2007 |
#maa telugu talliki mallepU daMDaa# |