Creative works from Telusuna Members

కావలి నేలే కళుగోళమ్మ!

రమాకాంతరావు చాకలకొండ


కావలి నేలే కళుగోళమ్మ!
నీవే మాకు దిక్కుగదమ్మా! ||కావలి||

1. దుష్ట దమనకు ఖడ్గము దాల్చి,
శిష్ట రక్షణ చేసెడి తల్లీ!
ఇష్ట దైవమై ఎందరో భక్తుల,
కష్టము తీర్చెడి మాకల్పవల్లీ! ||కావలి||

2. నుదుటి కుంకుమతో నిగ నిగ లాడుచు,
ఎదుట నిన్ను కని మురసే నమ్మా!
మొదటి పూజతో మ్రొక్కులు తీర్చ,
ఉదుటిగ నీ దరి కొచ్చే నమ్మా! ||కావలి||

3. పత్ర, పుష్పముల నైవేద్యముతో,
మిత్ర బంధులతో మ్రొక్కే మమ్మా!
శత్రు నాశిని సంతస కారిణి,
నిత్యము దయతో నను బ్రోవుమమ్మా! ||కావలి||

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో విలసిల్లే దుర్గ దేవి రూపమగు కళుగోళమ్మకు భక్తితో!
రమాకాంతరావు చాకలకొండ
Sunday, November 18, 2007


#maa telugu talliki mallepU daMDaa#

Back to list