Creative works from Telusuna Members

ఆడినది సిరి – అలమేల్ మంగ

చాకలకొండ రమాకాంతరావు

రాగం: మోహన రాగం
సంగీత కూర్పు, గానం : భీమశంకర్
నృత్యం: Dr. ఉషారాణి

ఆడినది సిరి – అలమేల్ మంగ
వేడుక చేయను - వేంకటనాధుని. ||ఆడినది||

1. హాస విలాసముల భావ లాస్యముతో
దోసిటి దాచిన బంతులు విసరి, నవ
రసముల తన భంగిమలందు
రాస క్రీడల రమ్యత పొసగగ. ||ఆడినది||

2. కౌగిట చేరగ సైగలు చేయుచు, న
యగారములు నటనలో చూపుచు, చే
వగ చిందుచు, చక్కగ నాడుచు,
ప్రకటిత ప్రభలతో పరువపు సిరులతో. ||ఆడినది||

3. ప్రేమను కన్నుల - పచరింపు చేయుచు,
కమ్మగ నవ్వుచు, యిమ్ముగ నాడుచు,
నెమ్మిగ నాధుని రమ్మని గోరుచు,
కొమ్మ ఆడినది కులుకులు జూపుచు. ||ఆడినది||

4. రాగ, భావములు, తాళము కుదరగ,
తొగ కన్నులలో విరహము జూపుచు,
రంగ రంగ వైభోగము పొంగగ
శృంగారముగ సరసము జేయుచు. ||ఆడినది||

చాకలకొండ రమాకాంతరావు Tuesday, November 13, 2007


#maa telugu talliki mallepU daMDaa#

Back to list