Creative works from Telusuna Members

పదహారెళ్ళ ప్రాయం

చిత్రకార్‌

పదహారేళ్ళ ప్రాయం
అద్దంలా స్వచ్చమైన కన్నె పరువం
నిశ్చలంగా, నిశ్శంబ్దంలా
తటాకపు గట్టు మీద వాకంలా
నిర్నిమేషంగా అలజడి రేపు తనువులా
అలలు రేపుతూ పడుతున్న జ్ఞాపకాల కెరటాలలా
గాలిలో తేలుతూ, మంచులో కరుగుతో
ఆంతలొనే నగిషీ కరించుకొంటూ
తిరిగి మంచుపూల బాష్పంగా మారుతూ
సిగ్గు పడుతూ, బిడియంతో పలకరిస్తూ
కిల కిల రాగంగా సవ్వళ్ళు చేస్తూ
పిల్ల గాలి తెల్ల మబ్బుల పూల గుచ్చంలా
కురిసే వానలో, మెరిసే మెరుపులా
ఉరకలేస్తూ వొళ్ళు విరుచుకున్న తనువు
ఏవేవో వినూత్న స్పందనములు రేపు మనసు
ఆందమైన రంగుల హరివిల్లు లాంటి వయసు
అరవిరిసిన మందారంలా పూచిన తొలి వలపు
మళ్ళీ నా జీవితాన విరిస్తే యెంత బాగుండు….!
చిత్రకార్‌


#padahaarELLa praayam
addamlaa swacchamaina kanne paruvam
niSchalamgaa, niSSambdamlaa
taTaakapu gaTTu miida vaakamlaa
nirnimEshamgaa alajaDi rEpu tanuvulaa
alalu rEputuu paDutunna jnaapakaala keraTaalalaa
gaalilO tElutuu, manculO karugutO
AntalonE nagishii karimcukonTuu
tirigi mancupuula baashpamgaa maarutuu
siggu paDutuu, biDiyamtO palakaristuu
kila kila raagamgaa savvaLLu cEstuu
pilla gaali tella mabbula puula gucchamlaa
kurisE vaanalO, merisE merupulaa
urakalEstuu voLLu virucukunna tanuvu
EvEvO vinuutna spandanamulu rEpu manasu
Amdamaina ramgula harivillu laamTi vayasu
aravirisina mamdaaramlaa puucina toli valapu
maLLii naa jiivitaana viristE yenta baagunDu….!
citrakaar

Back to list