Creative works from Telusuna Members

manasulu vippAli

mOhan vallaBajOSyula

మనసులు విప్పాలి
మోహన్ వల్లభజోశ్యుల
---
మనసులు విప్పాలి మనము కనులే తెరవాలి
ముదమున సరిపడ రాగము చూపాలి, అనురాగమె చూపాలి
గాలి వాన మంటా మన్ను, చెట్టు చేమ కొండా కోన
మనసున నుండాలీ, మన బతుకుతొ కలవాలి

మనకే, మనవే,
పవనమునాపే పర్వత పంక్తులు, వనముల పెంచే వర్షపు జల్లులు
పాడిని యిచ్చే పశుపక్ష్యాదులు, పంటల నిచ్చే నదీజలములు,..మనకే, మనవే..

పిట్టా పురుగు, పువ్వూ తఱుఁవులు మన శుభానికేనండి, వాటిని ఆదఱించండి..అ అ అ అ ఆ...

వినుకో, వినుకో,
శ్వాసను పంచే వసుధ మాతయు, వెలుగుల నిచ్చే సూర్యచంద్రులు
మేధను నిలిపే నక్షత్రములు, స్థావరమొసగే ఆకాశముయు..వినుకో, వినుకో..

మన యునికికె మూలము మర్చీ పోకండి, వీటికి స్థానము నివ్వండి,
ధన్య వాదము చెప్పండి...అ అ అ అ ఆ...
మనసుని విప్పాలి...

వరస అనుకరుణ: "మల్లీశ్వరి" లో "పఱుఁగులు తీయాలి, గిత్తలు.."#

వరస అనుకరుణ: "మల్లీశ్వరి" లో "పఱుఁగులు తీయాలి, గిత్తలు.."
#

Back to list