Creative works from Telusuna Members

My poem

Durga Prasad Varanasi

మా తెలుగు తల్లికి మల్లెపూ దండా
మానవ ధర్మం మానవ కర్తవ్యం

దుర్గాప్రసాదు వారణాసి
(24 నవంబరు 2007)

సర్వేశ్వరి మనకొసగిన
సర్వంబది పర్వమోయ్
పర్వంబుగ నెంచి నీవు
గర్వంబుగ కాపాడవోయ్

భూమాతను గోమాతను
శ్రీమాతగ నెంచవోయ్
ఆ మాతల నాదరించి
క్షేమావని జీవించవోయ్

పూర్వీకులు మనకిచ్చిన
పూర్వీకం పుణ్యమోయ్,
పుణ్యమైన పూర్వీకం
పుత్రులకందించవోయ్!

యుగయుగాల నీ జగతిలో
నిలచిన భూజం నిలువగ నీవొయ్,
కంపము బూనీ చంపగ బోకోయ్
ఱంపము బూనీ త్రెంపగబోకోయ్!


#maa telugu talliki mallepU daMDaa#
#mAnava dharmam mAnava kartavyam

durgAprasAdu vAraNAsi
(24 navambaru 2007)

sarvESvari manakosagina
sarvambadi parvamOy
parvambuga nemci nIvu
garvambuga kApADavOy

BhoomAtanu gOmAtanu
SrImAtaga nemcavOy
A mAtala nAdarimci
kshEmAvani jIvimcavOy

pUrvIkulu manakiccina
pUrvIkam puNyamOy,
puNyameina pUrvIkam
putrulakamdimcavOy!

yugayugAla nI jagatilO
nilacina BhUjam niluvaga nIvoy,
kampamu bUnI campaga bOkOy
~rampamu bUnI trempagabOkOy!#

Back to list