నా పేరె మోహం మోహన్ వల్లభజోశ్యుల --- నా పేరె మోహం, చేసేను మోసం, తెస్తాను మీకు తెలియని తాపం.. మీఁకెంతొ తెలివున్నా, మీఁరెంత వారైన నా వలయంలో పడే తీఁరుతారు నా మాయలొ పడి పోతారు...నా పేరె... ఏమూలైన కోఱికె యుంటె, అది చాలు నాకు వేరేమి వలదు మీమీదె నేను నా మహిమ చూపి, హాఁయిగ నేను ఊరుకుంటాను..నా పేరె... ఏమైన కాని, యెంతైన కాని, సుఖమే కాని, దుఃఖ్ఖము కాని వచ్చిన మీరు చెదఱఁక యుంటే, నామాన నేను వెళ్ళి పోతాను..నా పేరె... ప్రియమైనదంటూ ఏదైన యుంటే, నాకుదాసులయి తీఁఱుతారు దుర్దశలోకే వెళ్ళి పోతారు...నా పేరె... గమనిక: పాడదలఁచుకుంటే: అనుకరణ- రాజ్ కపూర్స్ "మేరా నామ్ జోకర్" లో టైటిల్ సాంగ్ |
# # |