Creative works from Telusuna Members

శయనించుమా స్వామి! శేషాద్రివాసా!

రమాకాంతరావు చాకలకొండ

శయనించుమా స్వామి! శేషాద్రివాసా!
నయనములు అలసినవి, భక్త జన పోషా! ||శయనించుమా||

1. సద్దు మణిగిన వేళ శిఖరములు దిగి వచ్చి,
ఎదనున్న సతులతో యించుగ గడిపేవు,
కొద్దు క్షణములే ఉండి, కొలువు తీరాలని
సర్దుకొని పోయేవు శ్రమ తీరకుండే. ||శయనించుమా||

2. ప్రొద్దు రాత్రని లేక, భక్తులను కాచేవు
నిద్ర కన్నెరుగక నారాయణ నీవు,
వద్దన్న చేసేవు వరుస జాగారాలు,
ఒద్దికగ యీ పూట పవళించ వయ్యా. ||శయనించుమా||

3. సకల జగముల స్వామి చక్కగా శయనించు
నీకై పాడెద నిదిగో ఒక జోల పాట,
ముకుళిత వదనముతో మగతలో తేలిపో,
అకళంక శ్రీహరే అల వేంకటేశ. ||శయనించుమా||


రమాకాంతరావు చాకలకొండ Monday, December 17, 2007


#maa telugu talliki mallepU daMDaa#

Back to list