Creative works from Telusuna Members

పదము తగిలిన యంత పాపులగు పుణ్యలు

రమాకాంతరావు చాకలకొండ

పల్లవి. పదము తగిలిన యంత పాపులగు పుణ్యలు
ఒద్దికగ వడి చేయ వరములే వరములు
అనుపల్లవి. ముద్దు సఖులైనచో ముంగిటందును సిరులు,
కదురు కొండల పతి కరుణయే కరుణలు. ||పదము||

1. మాధవ యని యనినంత ముదములే ముదములు,ఆ
రాధన చేయ అంతట సుఖములు,
ఎదగి వేంకటపతిని ఎఱుగిన ఎసగులు,
పదునైన వైరాగ్య పారితోషకములు. ||పదము||

2. గోవింద యని యన్న గొప్ప ఆనందములు
భువినాధు కొల్వగ బొసగు భాగ్యములు,
పావనుని తలపోయ పొంగును పదములు.
నవ విధుల సేవింప నందు కైవల్యములు. ||పదము||

3. రామ రామ యన్న రావు ఏ కష్టములు,
సామ గానము చేయ స్వర్గ సౌఖ్యములు,
నామ స్మరణ చేయ నందు నిర్ముక్తులు, తి
రుమలేశ యన్న తనరు తత్వములు. ||పదము||

రమాకాంతరావు చాకలకొండ
Saturday, December 22, 2007






#maa telugu talliki mallepU daMDaa#

Back to list