Creative works from Telusuna Members

మాతృ, పితృ, గురు, హిత, దేవోభవ!

Durga Prasad Varanasi

మాతృ, పితృ, గురు, హిత, దేవోభవ!

దుర్గాప్రసాదు వారణాసి
(31 డిసెంబరు 2007)

సూర్య భగవాను కిరణాలు సోకినంత
నమల కమలంబు వికసించు నటుల నేను
నరహితుని కరుణా సరోవరము నందు
జలక మాడంగ గాంక్షించు జలజ మేను!

చందమామ సుఖమొసంగు చంద మందు
అమ్మ నయనాల కనిపించె డాదరమ్ము
పిల్ల వాయువు గొనితెచ్చు చల్ల దనము
వెరసి వేంకటేశుండిచ్చు వరమదయ్య!

తల్లి తండ్రులు మనకిచ్చె తనువనంగ
గురుడు మనకిచ్చె సుజ్ఞ్యాన తరువనంగ
హితుడు మనకొసంగె నమూల్య హితమనంగ
తిరుమలేశుండు వారెల్ల తెలుగు వాడ!



#mAtR, pitR, guru, hita, dEvObhava!

durgAprasAdu vAraNAsi
(31 Disembaru 2007)

sUrya bhagavAnu kiraNAlu sOkinamta
namala kamalambu vikasimcu naTula nEnu
narahituni karuNA sarOvaramu namdu
jalaka mADamga gAmkshimcu jalaja mEnu!

chamdamAma sukhamosamgu chanda mamdu
amma nayanAla kanipimce DAdarammu
pilla vAyuvu goniteccu challa danamu
verasi vEnkaTESumDiccu varamadayya!

talli tamDrulu manakicce tanuvanamga
guruDu manakicce sujnyAna taruvanamga
hituDu manakosamge namUlya hitamanamga
tirumalESumDu vArella telugu vADa! #
#

Back to list