Creative works from Telusuna Members

తుల రాసీయులు

Durga Prasad Varanasi

తుల రాసీయులు

దుర్గాప్రసాదు వారణాసి
(1 జనవరి 2008)

[ఉపోద్ఘాతం: ప్రియ మిత్రులు, ప్రియ శ్రోతలు శ్రీ గరికపాటి వారి కోరిక తీర్చుటకు కూర్చిన చిన్న కానుక ఇది.]

తుల రాసి నిలయుడా! తులతూగు మయ్యనీ
వతులిత భోగాల వసుధ నెపుడు

అంధ్రావనీమాత కాదర్శ తనయుడై
వర్ధిల్ల బూనుమా వసుధ యందు

భాషాభిమానమ్ము మానమ్ముగా నెంచి
తెలుగువాణిని భక్తి గొలువుమయ్య

దేశాభిమానము దీక్షగా పాటించి
తెలుగు తల్లికి హారతీయుమయ్య

పుణ్య తెలుగు భూమిని నీవు పుట్టి నావు
పర్వ తెలుగు భాషను ప్రీతి పలికెడీవు
తిరుమలేశుని భక్తితోన్‌ శరణు వేడి
సార్ధకంబు సేయుము నీదు జన్మ మిలను.


#tula rAsIyulu

durgAprasAdu vAraNAsi
(1 janavari 2008)

[upOdghAtam: priya mitrulu, priya SrOtalu SrI garikapATi vAri kOrika tIrcuTaku koorcina cinna kAnuka idi.]

tula rAsi nilayuDA! tulatoogu mayyanI
vatulita bhOgAla vasudha nepuDu

amdhrAvanImAta kAdarSa tanayuDei
vardhilla boonumA vasudha yamdu

bhAshAbhimAnammu mAnammugA nemci
teluguvANini bhakti goluvumayya

dESAbhimAnamu dIkshagA pATimci
telugu talliki hAratIyumayya

puNya telugu bhoomini nIvu puTTi nAvu
parva telugu bhAshanu prIti palikeDIvu
tirumalESuni bhaktitOn SaraNu vEDi
sArdhakambu sEyumu nIdu janma milanu.#

Back to list