Creative works from Telusuna Members

సందేహం! - "తులరాసీయమా"? "తులరాశీయమా?"

దుర్గాప్రసాదు వారణాసి

సందేహం! - "తులరాసీయమా"? "తులరాశీయమా?"

దుర్గాప్రసాదు వారణాసి

నాకున్న సందేహమదేమిటంటే, నేను రచియించిన పద్యములోది ముద్రారాక్షమా? లేక, తప్పైన తెలుగా?

సదస్సు సభ్యులు నాకు సందేహ విముక్తి గలిగించ గలరని ఆశిస్తున్నాను.

ఇంకొక పద్యం:

తులరాశిలోజన్మ తులసీదళధారి
కరుణ నీకిచ్చిన వరమదయ్య

తులయైన మనసుతో తూచి కార్యంబులన్‌
క్షితి సేమమును యెంచి సేయు మయ్య

తూచంగ లేనట్టి తోచంగ రానట్టి
భోగాలలో తులతూగు మయ్య

తులరాశి జన్ముండ! తోటి వారల సేమ
మెంచి జీవింపగా నెంచు మయ్య

మంచి గుణములన్ని మస్తిష్కమును జేరు
మంచి నెరిగి నట్టి మానవునకు.
మంచి చెడుల భేద మెంచి జీవించరా
"తుల"ను బుట్టి నట్టి తెలుగు వాడ!



#samdEham! - "tularAsIyamA"? "tularASIyamA?"

durgAprasAdu vAraNAsi

nAkunna samdEhamadEmiTamTE, nEnu raciyimcina padyamulOdi mudrArAkshamA? lEka, tappeina telugA?

sadassu sabhyulu nAku samdEha vimukti galigimca galarani ASistunnAnu.

inkoka padyam:

tularASilOjanma tulasIdaLadhAri
karuNa nIkiccina varamadayya

tulayeina manasutO tooci kAryambulan
kshiti sEmamunu yemci sEyu mayya

tUcamga lEnaTTi tOcamga rAnaTTi
bhOgAlalO tulatoogu mayya

tularASi janmumDa! tOTi vArala sEma
memci jIvimpagA nemcu mayya

manci guNamulanni mastishkamunu jEru
manci nerigi naTTi mAnavunaku.
manci ceDula bhEda menci jIvimcarA
"tula"nu buTTi naTTi telugu vADa!#
#

Back to list