Creative works from Telusuna Members

శ్రీనివాస శతకం

దుర్గాప్రసాదు వారణాసి

శ్రీనివాస శతకం

దుర్గాప్రసాదు వారణాసి

[ఉపోద్ఘాతము: “శ్రీనివాస” మకుటముతో తెలుగు భాషలో శతక రచనకు సీస, ఆటవెలది, మరియు తేటగీతి చందస్సు సరిపోతుంది. ఆ పద్యముల ప్రయోగించి ఈ శతకరచనకు సాహసించితిని.]

ఆ.వె.:
శ్రీనివాస! నిన్ను చేతమందుననిల్పి
సృష్టి వంక నాదు దృష్టి జూపి
ఎల్ల లోక సరళి నెరుగ గోరెడి నాకు
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

సీ.:
రవి గాంచనిదియెల్ల కవి గాంచునని దెల్ప
రచియింతు నేనీ ప్రవచనములను

మస్తిష్క మందిరంబందులో స్పురియించు
మానవ ధర్మంబు మనవి సేతు

కమలాక్షుడిచ్చిన కనులార గాంచిన
పుడమి పోకడ నెల్ల నుడివె దిచట

పార్థసారథి నేర్పు పాఠంబు లవియెల్ల
పాఠక పంక్తితో పంచు కొనెద

ఆ.వె.:
అనుచు శతక మిపుడు ఆంధ్రమ్ములో వ్రాయ
సాహసమ్ము జూపు సత్కవినన
నిండు కవిత కలము నుండి ధారగ జార
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

భర్తృహరిని గాను కార్తికేయుడ గాను
నీతి శాస్త్ర మిలను నేర్ప నెంచ
తోచెడూహలన్ని తూచి తెల్పుట నాకు
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

“విశ్వధాభిరామ వినుర వేమ!” యనెడు
మకుట మందు శతక మవని నుండ
"నీతి నేర్ప నెంచ నేనెవ్వడను స్వామి?"
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

తెలుగు నందున్‌ సుమతీ శతమకంబది
తెలుగు వరి కెల్ల తెలివొసంగ
నీతి శతకమిపుడు నేవృఅయనేలంచు
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

ఆవు కున్న యట్టి ఆదర్శ జీవాత్మ
అన్యులకును లేదు అవని జూడ
నిన్ను జేరె డాత్మ నిస్వార్ధ మనియంచు
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

తల్లి తండ్రు లొసగ తనువు నీ ధాత్రిలోన్‌
గురువు జూపు బ్రతుకు తెరువు మాకు
ధరణి తల్లి తండ్రి గురువు ణివని మాకు
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

పార్థసారథీ! అపారకృపానిధీ!
గురువు లెల్లరకును గురువు వీవు
పార్థుడనని యెంచి పాఠంబు నేర్పంగ
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

తే.గీ.:
తృష్ణ లన్నియు దీర్చు శ్రీకృష్ణమూర్తి!
పార్ఠసారఠివై మాకు పాఠములను
బోధ జేసెడి గురుపుంగవుండవనుచు
తెలుపుము రమేశ! పరమేశ! తిరుమలేశ!

(సశేషం)




#SrInivAsa Satakam

durgAprasAdu vAraNAsi

[upOdghAtamu: “SrInivAsa” makuTamutO telugu bhAshalO Sataka racanaku sIsa, ATaveladi, mariyu tETagIti chandassu saripOtundi. A padyamula prayOgimci I Satakaracanaku sAhasimcitini.]

A.ve.:
SrInivAsa! ninnu cEtamamdunanilpi
sRshTi vamka nAdu dRshTi joopi
ella lOka saraLi neruga gOreDi nAku
telupumO ramESa! tirumalESa!

sI.:
ravi gAmcanidiyella kavi gAmcunani delpa
raciyimtu nEnI pravacanamulanu

mastishka mamdirambamdulO spuriyimcu
mAnava dharmambu manavi sEtu

kamalAkshuDiccina kanulAra gAmcina
puDami pOkaDa nella nuDive dicaTa

pArthasArathi nErpu pAThambu laviyella
pAThaka pamktitO pamcu koneda

A.ve.:
anucu Sataka mipuDu AndhrammulO vrAya
sAhasammu joopu satkavinana
nimDu kavita kalamu numDi dhAraga jAra
telupumO ramESa! tirumalESa!

bhartRharini gAnu kArtikEyuDa gAnu
nIti SAstra milanu nErpa nemca
tOceDUhalanni tooci telpuTa nAku
telupumO ramESa! tirumalESa!

“viSvadhAbhirAma vinura vEma!” yaneDu
makuTa mamdu Sataka mavani numDa
"nIti nErpa nemca nEnevvaDanu swAmi?"
telupumO ramESa! tirumalESa!

telugu namdun sumatI Satamakambadi
telugu vari kella telivosamga
nIti SatakamipuDu nEvRayanElamcu
telupumO ramESa! tirumalESa!

Avu kunna yaTTi AdarSa jIvAtma
anyulakunu lEdu avani jooDa
ninnu jEre DAtma niswArdha maniyamcu
telupumO ramESa! tirumalESa!

talli tamDru losaga tanuvu nI dhAtrilOn
guruvu joopu bratuku teruvu mAku
dharaNi talli tamDri guruvu Nivani mAku
telupumO ramESa! tirumalESa!

pArthasArathI! apArakRpAnidhI!
guruvu lellarakunu guruvu vIvu
pArthuDanani yemci pAThambu nErpamga
telupumO ramESa! tirumalESa!

tE.gI.:
tRshNa lanniyu dIrcu SrIkRshNamoorti!
pArThasAraThivei mAku pAThamulanu
bOdha jEseDi gurupungavumDavanucu
telupumu ramESa! paramESa! tirumalESa!

(saSEsham)#


Back to list