Creative works from Telusuna Members

Srinivasa Satakam -2

Durga Prasad Varanasi

శ్రీనివాస శతకం - 2

దుర్గాప్రసాదు వారణాసి


మహిని జన్మ మొంద మహితాత్ములము గాము!
మహిత జూప నట్టి మనుగడలను;
మానవులకు మేటి మనుగడయననేమి?
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

స్వార్ధ మద లోభ మాత్సర్యపార్ధలోలు
లై వసించు మానవకోటి జ్ఞానహీన
మై నశింప, రక్షింప సుజ్ఞాన మెల్ల
తెలుపు రమేశ! పరమేశ! తిరుమలేశ!

దాసు లైన వార్కి దారిద్ర్య మదియేల?
దాస్య మనగ జగతి హాస్య మేల?
“దాసపోషక” బిరుదాంకిత! దీనాప్త!
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

ఘనత నొంది నంత ఘాతకంబుల జేయు
మానవాళి గాచు మార్గ మేమి?
రావణాది ఘనుల రక్షించినావనన్¯
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

యశము నొంది నంత దశది మారగనేల?
దిశయు మార నేల దశది మార?
గతము నందు భావి హితమున్నదని మాకు
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

పాపు లైన వారి నాపు వారెవరయ్య?
సాధువులను గాచు నాధు లెవరు?
కంచె మేయు చేను కలకాలముండునా?
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

రాజ్య పాలకులును రాజకీయాసక్తి
మునిగి రాజ్యములకు ముప్పు గూర్చ
అవని ప్రజకు సౌఖ్య మెవరు గూర్తురు స్వామి?
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

కోరినంత నీవు కోర్కెలన్నియు దీర్ప
గోరుచుందుము మితిమీరి మేము!
తృప్తి యనెడు గుణము వ్యాప్తి సేయుటదెట్లు?
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

గరళ కంఠు డతడు గంగాధరునికిన్¯
ధరణి నావహించు గరళ మెల్ల
కంఠ మందు జేర్చు కాలమొచ్చినదంచు
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

కన్న తల్లి ప్రేమ కన్న మిన్నిల లేదు
కన్న తండ్రి కన్న మిన్న లేడు
కన్న బిడ్డ చెంత మన్ననొందగరేమి?
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

కరిని రక్షింప హరియు మకరిని జంప
కరియు మకరియు జేరె హరికి దరికి
మదము నణగించి హరిజేరు మార్గ మేమి?
తెలుపుమో రమేశ! పరమేశ! తిరుమలేశ!

బలిని పాతాళ లోకంబు బంపి నట్టి
నాగ రాజైన కాళీయు ననచి నట్టి
చరణ పంకజంబుల నంటు తరుణ మెపుడు?
తెలుపుమో రమేశ! తిరుమలేశ!

సూర్య భగవాను కిరణాలు సోకి నంత
నమల కమలమ్ము వికసించు నటుల నేను
ధరణి దరియింప గోరంగ గరుణ తెరువు
దెలుపుమో రమేశ! తిరుమలేశ!

ఆంజనేయు డర్పించు భక్తాంజలులివి
అర్జునుడు సమర్పించు శ్రధ్ధాంజలులివి
అర్చకుడ పాడు తేటగీతాంజలులివి
తెలుపగను రమేశ! తిరుమలేశ!






#SrInivAsa Satakam - 2

durgAprasAdu vAraNAsi


mahini janma momda mahitAtmulamu gAmu!
mahita joopa naTTi manugaDalanu;
mAnavulaku mETi manugaDayananEmi?
telupumO ramESa! tirumalESa!

swArdha mada lObha mAtsaryapArdhalOlu
lei vasimcu mAnavakOTi jnAnahIna
mei naSimpa, rakshimpa sujnAna mella
telupu ramESa! paramESa! tirumalESa!

dAsu leina vArki dAridrya madiyEla?
dAsya managa jagati hAsya mEla?
“dAsapOshaka” birudAmkita! dInApta!
telupumO ramESa! tirumalESa!

ghanata nomdi namta ghAtakambula jEyu
mAnavALi gAcu mArga mEmi?
rAvaNAdi ghanula rakshimcinAvanan
telupumO ramESa! tirumalESa!

yaSamu nomdi namta daSadi mAraganEla?
diSayu mAra nEla daSadi mAra?
gatamu namdu bhAvi hitamunnadani mAku
telupumO ramESa! tirumalESa!

pApu leina vAri nApu vArevarayya?
sAdhuvulanu gAcu nAdhu levaru?
kamce mEyu cEnu kalakAlamumDunA?
telupumO ramESa! tirumalESa!

rAjya pAlakulunu rAjakIyAsakti
munigi rAjyamulaku muppu goorca
avani prajaku sowkhya mevaru goorturu swAmi?
telupumO ramESa! tirumalESa!

kOrinamta nIvu kOrkelanniyu dIrpa
gOrucumdumu mitimIri mEmu!
tRpti yaneDu guNamu vyApti sEyuTadeTlu?
telupumO ramESa! tirumalESa!

garaLa kamThu DataDu gamgAdharunikin
dharaNi nAvahimcu garaLa mella
kamTha mamdu jErcu kAlamoccinadancu
telupumO ramESa! tirumalESa!

kanna talli prEma kanna minnila lEdu
kanna tamDri kanna minna lEDu
kanna biDDa cemta mannanomdagarEmi?
telupumO ramESa! tirumalESa!

karini rakshimpa hariyu makarini jampa
kariyu makariyu jEre hariki dariki
madamu naNagimci harijEru mArga mEmi?
telupumO ramESa! paramESa! tirumalESa!

balini pAtALa lOkambu bampi naTTi
nAga rAjeina kALIyu nanaci naTTi
caraNa pamkajambula namTu taruNa mepuDu?
telupumO ramESa! tirumalESa!

soorya bhagavAnu kiraNAlu sOki namta
namala kamalammu vikasimcu naTula nEnu
dharaNi dariyimpa gOramga garuNa teruvu
delupumO ramESa! tirumalESa!

AmjanEyu Darpimcu bhaktAmjalulivi
arjunuDu samarpimcu SradhdhAmjalulivi
arcakuDa pADu tETagItAmjalulivi
telupaganu ramESa! tirumalESa!

#


Back to list