Creative works from Telusuna Members

పోతనానుసార హరిసంస్మరణం

దుర్గాప్రసాదు వారణాసి

పోతనానుసార హరిసంస్మరణం

దుర్గాప్రసాదు వారణాసి
(11 జనవరి 2008)

[ఉపోద్ఘాతము: దేవర్షి నారద మహాముని తరువాత హరి భక్తులలో, చిరంజీవుడైనె మహామహితాత్ముడు, కపి పుంగవుండా మారుతి తరువాత శ్రీరామ భక్తులలో, బమ్మెర పోతనామాత్యుడే అగ్రగణ్యుడు. ఆ మహానుభావుడు నేను సగోత్రీకులము. అందుకే అత్యంత భక్తిప్రపత్తులతో, ఆయెనకు చిన్నవాడినైనందుకు చనువుతొ, ఆయన పద్యాల నీ క్రింద నేననసరించాను. పాఠకులు నన్ను మన్నింప ప్రార్ధన. నేను మన్నింపరాని అపరాధమొనరించానని దండింపకుడు.]


అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా

పల మందార వనాంతరామృతసరఃప్రాంతేందు కాంతోపలో

త్పల పర్యంక రమావినోదివగు ఆపన్న ప్రసన్నుండ! వి

హ్వల నాగేంద్రము "పాహి పాహి" యన కుయ్యాలించి సమ్రంభివై,

తదనంతరము:

సిరికింజెప్పుము శంఖచక్రయుగమున్‌ చేదోయిసంధించి నీ

పరివారముంజీరుచభ్రగపతిన్‌ బన్నించుచాకర్ణికాం

తర ధమ్మిలము జక్కనొత్తుచు వివాదప్రోత్ఠిత శ్రీకుచో

పరిచేలాంచలమున్‌ భరించి నను గాపాడంగ రమ్మీతృటిన్‌



#pOtanAnusAra harisamsmaraNam

durgAprasAdu vAraNAsi
(11 janavari 2008)

[upOdghAtamu: dEvarshi nArada mahAmuni taruvAta hari bhaktulalO, chiramjIvuDeine mahAmahitAtmuDu, kapi pungavumDA mAruti taruvAta SrIrAma bhaktulalO, bammera pOtanAmAtyuDE agragaNyuDu. A mahAnubhAvuDu nEnu sagOtrIkulamu. andukE atyamta bhaktiprapattulatO, Ayenaku cinnavADineinanduku chanuvuto, Ayana padyAla nI krinda nEnanasarimcAnu. pAThakulu nannu mannimpa prArdhana. nEnu mannimparAni aparAdhamonarimcAnani damDimpakuDu.]


ala veikumTha purambulO nagarilO nAmUla sowdhambu dA

pala mamdAra vanAmtarAmRtasara@hprAntEndu kAntOpalO

tpala paryamka ramAvinOdivagu Apanna prasannumDa! vi

hvala nAgEmdramu "pAhi pAhi" yana kuyyAlimci samrambhivei,

tadanamtaramu:

sirikinjeppumu Samkhacakrayugamun cEdOyisamdhimci nI

parivAramunjIrucabhragapatin bannimcucAkarNikAm

tara dhammilamu jakkanottucu vivAdaprOtThita SrIkucO

paricElAmcalamun bharimci nanu gApADamga rammItRTin
#

Back to list