Creative works from Telusuna Members

Srinivasa satakam -3

Durga Prasad Varanasi

శ్రీనివాస శతకం - 3

దుర్గాప్రసాదు వారణాసి

నైఋతీ ఋతీ పవనంబున బుట్టి
కృష్ణ గౌతమీ ఝరులగన్¯ గీర్తి నొందు
పూజ్య గంగా భవాని నీ పుత్రి యనుచు
తెలుపుము రమేశ! పరమేశ! తిరుమలేశ!

నైఋతీ ఋతుపవనంబు నదుల సరళి
జీవ ధారల మాకిచ్చు, జీవ మిచ్చు
నైఋతీ ఋతు సంధాత! నరుల హితుడ!
తెలుపుము రమేశ! పరమేశ! తిరుమలేశ!

గంగ పారెడు నేలలో కరువు లేదు
గౌతమీ కృష్ణలే పొంగు భూతలంబు
క్షామ మన్నది లేదంచు మేమెరుంగ
తెలుపుము రమేశ! పరమేశ! తిరుమలేశ!

భవుడు పద్మభవుడు గొల్చు పాదములను
సిరి ధరణిజ రుక్మిణి గొల్చు చరణములను
తాకి తరియించు సౌభాగ్య తరుణ మెపుడు?
తెలుపుము రమేశ! పరమేశ! తిరుమలేశ!

బుద్ధ భగవానుండు సద్బోధ జేసె
మహిని “సత్యం వద”ని “ధర్మం చర”నియు
మరచితిమి మేమా ధర్మ మార్గ మనుచు
తెలుపుము రమేశ! పరమేశ! తిరుమలేశ!

మహి“నహింసయే పరమ ధర్మం”బనియెడు
శాంతిమతము పాటింప లేనంత నంత
మగును భావి సౌభాగ్య సంపత్తి యనుచు
తెలుపుము రమేశ! పరమేశ! తిరుమలేశ


భచ్క్¯ తొ లిస్త్¯


#SrInivAsa Satakam - 3

durgAprasAdu vAraNAsi

neiRtI RtI pavanambuna buTTi
kRshNa gowtamI Jharulagan gIrti nomdu
poojya gamgA bhavAni nI putri yanucu
telupumu ramESa! paramESa! tirumalESa!

neiRtI Rtupavanambu nadula saraLi
jIva dhArala mAkiccu, jIva miccu
neiRtI Rtu samdhAta! narula hituDa!
telupumu ramESa! paramESa! tirumalESa!

gamga pAreDu nElalO karuvu lEdu
gowtamI kRshNalE pomgu bhootalambu
kshAma mannadi lEdancu mEmerumga
telupumu ramESa! paramESa! tirumalESa!

bhavuDu padmabhavuDu golcu pAdamulanu
siri dharaNija rukmiNi golcu caraNamulanu
tAki tariyimcu sowbhAgya taruNa mepuDu?
telupumu ramESa! paramESa! tirumalESa!

buddha bhagavAnumDu sadbOdha jEse
mahini “satyam vada”ni “dharmam cara”niyu
maracitimi mEmA dharma mArga manucu
telupumu ramESa! paramESa! tirumalESa!

mahi“nahimsayE parama dharmam”baniyeDu
SAmtimatamu pATimpa lEnamta namta
magunu bhAvi sowbhAgya sampatti yanucu
telupumu ramESa! paramESa! tirumalESa


Back to list

Back to list