చిన్నారి పాపలు – చిరులేత పత్రాలు దుర్గాప్రసాదు వారణాసి (19 జనవరి 2008) చిన్నారీ పాపలూ! చిరులేత పత్రాలూ కన్న ప్రేమ ధారలోయీ! వెన్నుడిచ్చు వరములోయీ! ||చిన్న|| జీవన్ముక్తికీ వారలే ఆధారం జీవన్శృష్టికీ వారలే పరమార్థం పిల్లలనూ ప్రేమించరా మెల్లగనూ జీవించరా ||చిన్న|| పిల్లలకై మనముంటే పిల్లలే మనకుంటే సౌభాగ్య సంసారమోయ్ సంతోష సౌభాగ్యమోయ్! ||చిన్న|| పిల్లలనూ కనినంతనె ఝల్లుమనును నీ దేహం పిల్లలనూ గాంచుటలో తల్లడిల్లు నీ హృదయం ||చిన్న|| ప్రేమించ బూనోయీ! తరియింప నెంచోయీ! పిల్లలే దేవులనే భావాన్నీ పెంచవొయ్! ||చిన్న|| Back to list |
#cinnAri pApalu – cirulEta patrAlu durgAprasAdu vAraNAsi (19 janavari 2008) cinnArI pApaloo! cirulEta patrAloo kanna prEma dhAralOyee! vennuDiccu varamulOyee! ||cinna|| jIvanmuktikI vAralE AdhAram jIvanSRshTikI vAralE paramArtham pillalanoo prEmimcharA mellaganoo jIvimcarA ||cinna|| pillalakei manamumTE pillalE manakumTE sowbhAgya samsAramOy santOsha sowbhAgyamOy! ||cinna|| pillalanoo kaninamtane Jallumanunu nI dEham pillalanoo gAncuTalO tallaDillu nI hRdayam ||cinna|| prEmimca boonOyee! tariyimpa nemcOyee! pillalE dEvulanE bhAvAnnI pencavoy! ||cinna|| # Back to list |