అది యొక మధురానుభూతి ఆనందామృత ధారా స్రవంతి ఇల్లాలి ఆలింగనా సౌఖ్యంపు శాంతి ఈడేరగా హృదయ కాంక్షా క్రాంతి! ఉదయ భాను అరుణ కిరణ కాంతి ఊయలలూపి వదిలించె నిద్రా భ్రాంతి ఋషుల వేద పారాయణా శ్రవణ శాంతి ఎద రగిలించె భక్తి భావనానురక్తి ఏమా నారాయణనామ పారాయణా శక్తి! ఐరావతావరోహణం ఇంద్ర భోగం ఒకరికి విమాన యాన యోగం ఓడలో విహారమే కొందరికి ప్రాప్తం ఔరా ఏమి ఈ వైపరీత్యం అంతా విధి లిఖితం! |
#maa telugu talliki mallepU daMDaa# |