Creative works from Telusuna Members

జన్మ రోగములందు చిక్కిన వారికి

చాకలకొండ రమాకాంతరావు

జన్మ రోగములందు చిక్కిన వారికి,
ఉన్న దొకటే మందు, వెంకన్న పొందు. ||జన్మ||

1. మాటి మాటికి పుట్టి, మాటి మాటికి చచ్చు,
మేటి రోగములకు ఘాటు మందు,
సాటి వారిని తిట్టు, సన్ని పాతమునకు,
శ్రేష్టమగు హరి సేవే సరియైన మందు. ||జన్మ||

2. నాటకపు బ్రతుకుల నికృష్ట వ్యాధులకు,
దీటైన హరి పదమే తగిన మందు,
రాటు తేలిన రాతి హృదయ రోగములకు
అడగు నిచ్చెడి దొకటే అచ్యతుని మందు. ||జన్మ||

3. వట్రిల్లు దేహపు విషజ్వరంబులకు,
వటువు విష్ణు కీర్తే వన్నె మందు,
చేటు చేసెడి మదుల మాత్సర్య రోగముకు,
చాటు చక్రి నుతే చక్కని మందు. ||జన్మ||

4. కుటిలపు మనసుల కుష్టు రోగములకు
కోటి కేశవ స్మరణే కఠినపు మందు
గిట్టని తనముకు, గాటులకు, నొప్పులకు,
గోటు హరి నామమే గొప్పగు మందు. ||జన్మ||

చాకలకొండ రమాకాంతరావు February 5, 2008


#maa telugu talliki mallepU daMDaa#

Back to list