సర్వాంతర్యామి హరి శ్రీనివాసుడు సర్వ జీవ కోటి విభుడు శ్రీనివాసుడు. ||సర్వాంతర్యామి|| 1. నింగి లోన తొంగి చూడ శ్రీనివాసుడు, పొంగి పోవు కడలి లోన శ్రీనివాసుడు, వంగు పైరు గాలి లోనూ శ్రీనివాసుడు తొంగి చూడ నందరిలో తిరమలేశుడు. ||సర్వాంతర్యామి|| 2. కండ్లు వుండి పొడగాంచిన శ్రీనివాసుడు, మండు అగ్ని జ్వాలయందు శ్రీనివాసుడు, అండ మన అందరికి శ్రీనివాసుడు, తండ్రి మన తరగని గని తిరుమలేశుడు. ||సర్వాంతర్యామి|| 3. బీదయందు బిక్కయందు శ్రీనివాసుడు పేద యందు, ప్రభువు నందు శ్రీనివాసుడు, ఎద ఎదలో, ఎక్కడైన శ్రీనివాసుడు ప్రతి మదిలో పరమాత్ముడు తిరుమలేశుడు. ||సర్వాంతర్యామి|| రమాకాంతరావు చాకలకొండ 02 ఫిబ్రవరి 2008 |
#maa telugu talliki mallepU daMDaa# |