సేవింతురే సిరిని, సంపదను, పైడిని, సేవింప జూడరే శ్రీ వేంకటేశుని. ||సేవింతురే|| 1. సేవింతురే రమణి సొంపుల మోమును, భావింతురే అందే బంగారు గనులు, కావింతురే తనకు కైంకర్య సేవలు, సేవింప కదలరే శ్రీ శ్రీనివాసుని? ||సేవింతురే|| 2. సేవింతురే మణి, మాణిక్య, నిధులను సేవింతురే సిరులు కల్గిన వారిని, సేవింతురే పదవి, పేరు, కీర్తులను, సేవింప రెందుకు శ్రీనాధు పదము? ||సేవింతురే|| 3. సేవింతురే రాజ పదవున్న వారిని, సేవింతురే బలము, బలుపున్న వారిని, సేవింతురే మత్తు, మాదక ద్రవ్యములు సేవింతురే యింత మాధవుని పదము? ||సేవింతురే|| 4. క్షణిక సుఖముల కొఱకు చొంగలు గార్తురే, క్షణమైన మదిలోన యోచనలు చేయరే? ఫణి శయనుని పదము పర భాగ్య మని ఎంచి, రాణింపరే భువిన రామ పద దాసులు. ||సేవింతురే|| రమాకాంతరావు చాకలకొండ February 1, 2008 |
#maa telugu talliki mallepU daMDaa# |