లాలి పాటల తోటి జోల పాడెదను, బాల గోపాలునికి హాయి చేసెదను. ||లాలి|| 1. మధుర గాన లహరి మోహన రవముతో, మాధవుని కన్నులలో మత్తు నింపెదను, సుధలొలుక సంగీత సామ గానముతో, బాలుని పెదవులలో పాలు నింపెదను. ||లాలి|| 2. గోపి కాంతమణులు గోముగ చూడ గోపాల కృష్ణుని ఊయలూపెదను, తాపములు తీర్చెడి తిరుమల పతిని పాపగ తలబోసి పాట పాడెదను. ||లాలి|| 3. అచ్చరలు అరు దెంచి ఆంధ్రనాట్యమును ముచ్చట గొల్పగ ముంగిట నాడ, యిచ్ఛగ శ్రీపతి ఏడుకొండల వాడు నచ్చిన రీతిలో నిదుర పుచ్చెదను. ||లాలి|| రమాకాంతరావు చాకలకొండ February 6, 2008 |
#maa telugu talliki mallepU daMDaa# |