భావయామి రఘురామ స్వరూపం, భజరే మేఘ శ్యామం, భవ సాగర భయ దుఃఖ విదూరం, భజరే రఘుకుల సోమం. || భావయామి|| 1. శాంతా కారం, సుందర వదనం, చంద్రలేఖ సమ మృదు దరహాసం, కందర్ప, విరించి జనకం, రామ చంద్రం, అతి రమ్య సునామం. || భావయామి|| 2. రావణాది దుర్జన వినాశం, సేవక జన గణ సదారక్షకం, పవమాన సుత పాద సేవితం, శివ, బ్రంహేంద్ర, సురగణ వినుతం. || భావయామి|| 3. రవి మండల సమ సురుచిరు రూపం, కవి గణ వర్ణితం, కోదండ రామం, భువి సుత హృదయ నిత్య నివాసం, కోవిద వినుతం, కలి వేంకటేశం. || భావయామి|| రమాకాంతరావు చాకలకొండ February 7, 2008 |
#maa telugu talliki mallepU daMDaa# |