ఓంకార నాదముతో వెలసిన మంత్రము శంకరము యిది శ్రీకర యోగము. ||ఓంకార|| 1. వాణి వీణ నాద వయ్యారి గీతమై, పరి త్రాణము చేయు పరిశుద్ధ రాగమై, వేణు గానములోని వలపు సంగీతమై, మేను పులకింతల మోహన నామమై ||ఓంకార|| 2. తత్వ స్వరూపమై, తామసహరమై, సత్వము సమకూర్చు సంభృత శక్తియై, నిత్యము భక్తులకు నిర్మల మార్గమై, ముక్తి నిచ్చెడి దివ్య మంగళ రూపమై. ||ఓంకార|| 3. వేంకటాద్రి వన వైభోగ కుసుమమై, సంకటములు తీర్చు సంపూర్ణ తీర్ధమై, శంకర, సుర నుత శ్రీకర రూపమై పంకజ నాభుని పావన నామమై. ||ఓంకార|| రమాకాంతరావు చాకలకొండ February 09, 2008 |
#maa telugu talliki mallepU daMDaa# |