Creative works from Telusuna Members

అన్ని జీవులలోన ఆత్మ ఒక్కటే

రమాకాంతరావు చాకలకొండ

పల్లవి. అన్ని జీవులలోన ఆత్మ ఒక్కటే
కనుగొన్న కష్టములు, సుఖము లొక్కటే! ||మేని||

అనుపల్లవి. మేని బేధములున్న మూల మొక్కటే,
యిన్ని చేసెడి వానికి అందరొక్కటే! ||మేని||

1. పశువులైన, పక్షులైన ప్రాణ మొక్కటే,
ఆశలు, ఆరాటములు అంత టొక్కటే,
దశ దిశల దేహులలో జీవ మొక్కటే
పోషించే పరమాత్మ ప్రేమ ఒక్కటే! ||మేని||

2. అందరిలో ఆకలి, దాహ మొక్కటే, అ
నందము, అలమటింపు, ఆర్తి ఒక్కటే,
డెందములో ఆప్యాయత పొంగు ఒక్కటే
కుందుటలో కారు కన్నీరు ఒక్కటే! ||మేని||

3. పేద నైన, ప్రభువు నైన, ఖేద మొక్కటే
వేదనల, వంతల బాధ ఒక్కటే,
సుధలాగ వ్యాధులు తొలగించే వైద్యము,
వేద పురుషుడు వేంకని నామ మొక్కటే! ||మేని||

రమాకాంతరావు చాకలకొండ February 10, 2008


#maa telugu talliki mallepU daMDaa#

Back to list