పలుకువోయీ పార్థసారథీ! దుర్గాప్రసాదు వారణాసి (23 ఫిబ్రవరి 2008) పలుకవోయీ పార్థసారథీ! తెలుపుమోయీ తిరుమలేశా! ఎవ్వాడ నేనయ్య నన్నేలు తండ్రీ? ఈ వాడ నిలువంగ నిది యేల తండ్రీ? దుర్గాంబయే నన్ను దీవించి దింపెనో? లక్ష్మమ్మయే నన్ను లాలించి పంపెనో? వాణీమహామణి నన్నొకవానిగా జేసెనో? ఈ నాడు నే నీ నాడులో నుంటినో? ఎన్నెన్ని జన్మాల పుణ్యాల ఫలమో ఎన్నెన్ని వైనట్టి నా తపోఫలములో ఈనాడు ఈరీతి నన్నాదరించితివి దరిజేర్చి లాలించి దరి జూప రావో! |
# palukuvOyI pArthasArathI! durgAprasAdu vAraNAsi (23 phibravari 2008) palukavOyI pArthasArathI! telupumOyI tirumalESA! evvADa nEnayya nannElu tanDrI? I vADa niluvanga nidi yEla tanDrI? durgAmbayE nannu dIvimci dimpenO? lakshmammayE nannu lAlimci pampenO? vANImahAmaNi nannokavAnigA jEsenO? I nADu nE nI nADulO nunTinO? ennenni janmAla puNyAla phalamO ennenni vainaTTi nA tapOphalamulO eenADu eerIti nannAdarimcitivi darijErci lAlinci dari joopa rAvO!# |